సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ

19 Apr, 2015 02:35 IST|Sakshi
సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ

వాషింగ్టన్: భారత్‌కు ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడే సత్తా పెరిగిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జైట్లీ, ఈ పర్యటనలో భాగంగా పీటర్‌సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విస్తృతమైన మార్కెట్ పరిమాణం, డిమాండ్, కరెన్సీ స్థిరత్వం ప్రస్తుతం భారత్‌కు కలసి వస్తున్న అంశాలని అన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఇబ్బంది ఏదీ ఉండబోదని అన్నారు.

>
మరిన్ని వార్తలు