రూ.64,564 కోట్లకు జన్‌ధన్‌ డిపాజిట్లు

17 Jul, 2017 01:32 IST|Sakshi
రూ.64,564 కోట్లకు జన్‌ధన్‌ డిపాజిట్లు

న్యూఢిల్లీ: సామాన్యుల కోసం మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జన్‌ధన్‌ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.64,564కోట్లకు చేరాయి. ఈ పథకం కింద జీరో బ్యాలన్స్‌ సదుపాయంతో ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. ఈ ఏడాది జూన్‌ 14 నాటికి జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 28.9 కోట్లు.

వీటిలో 23.27  కోట్లు ప్రభుత్వ బ్యాంకుల్లోవి కాగా, 4.7 కోట్లు గ్రామీణ బ్యాంకుల్లో, 92.7 లక్షల ఖాతాలు ప్రైవేటు బ్యాంకుల్లోనివి. ఈ మొత్తం ఖాతాల్లో నగదు నిల్వలు రూ.64,564 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసే నాటికి ఈ ఖాతాల్లోని డిపాజిట్లు రూ.64,252 కోట్లుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం మార్పిడికి జన్‌ధన్‌ ఖాతాలను ఉపయోగిస్తున్నారన్న ప్రచారం జరగ్గా ప్రభుత్వం హెచ్చరించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు