మారుతి కార్యాలయంపై దాడులు

3 Jun, 2016 14:11 IST|Sakshi
మారుతి కార్యాలయంపై దాడులు

టోక్యో: మైలేజ్ పరీక్ష కుంభకోణంలో  మారుతి సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామంటూ  మారుతి తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.  వ్యక్తిగత భాగాల్లో అంతర్గతంగా   నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామన్న  సుజుకి వాదనల నిర్ధారణ కోసం ఈ దాడులు నిర్వహించినట్టు  రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అక్రమ ఇంధన మైలేజీ ఆరోపణలపై  విచారణలో భాగంగా మినీ కార్ మేకర్ సుజుకి ఆఫీసుపై దాడి చేసినట్టు చెప్పారు.  


కాగా మైలేజీ గణంకాలు తప్పుగా పేర్కొన్నామని, తాము కూడా తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్లో మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ పై  రవాణా మంత్రిత్వశాఖ దాడి తర్వాత ఇది  రెండవది. అక్రమ మైలేజీ గణంకాలతో   4 బ్రాండెడ్  మోడల్స్,   12 ఇతర బ్రాండ్లను సుజుకి  విక్రయాలు జరిపింది


 
 

మరిన్ని వార్తలు