భారత్‌కు అమెజాన్‌ చీఫ్‌ మరో బహుమతి..

20 Jan, 2020 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మూడు రోజుల పర్యటన అనంతరం అమెరికాకు చేరుకున్న ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ వర్గాలు, చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురైనా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన జెఫ్‌ బెజోస్‌ తాజాగా మరో గిఫ్ట్‌ అంటూ ట్వీట్‌ చేశారు. భారత్‌కు పర్యావరణ అనుకూల ఎలక్ర్టిక్‌ రిక్షాలను డెలివరీ చేస్తామని జెఫ్‌ బెజోస్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ట్వీట్‌తో పాటు పోస్ట్‌ చేసిన వీడియోలో ఈరిక్షాను నడుపుతూ జెఫ్‌ బెజోస్‌ కనిపించారు.

కాగా రానున్న ఐదేళ్లలో భారత్‌లో పది లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు భారత్‌ పర్యటనలో ఆయన వివరించారు. గత ఆరేళ్లుగా భారత్‌లో పెట్టుబడులతో కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమని బెజోస్‌ పేర్కొన్నారు.  

చదవండి : భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు..

మరిన్ని వార్తలు