జెట్‌ ఎయిర్‌వేస్‌ 30 శాతం డిస్కౌంట్‌..

31 Mar, 2018 02:29 IST|Sakshi

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌  ‘ఈస్టర్‌ డీల్స్‌’లో భాగంగా దేశీ, విదేశీ విమాన టికెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తించే ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 2 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన టికెట్లను బుకింగ్‌ చేసుకున్నవారు 2018 సెప్టెంబర్‌ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. అదే విదేశీ ప్రయాణపు టికెట్లను బుకింగ్‌ చేసుకున్నవారు నేటి నుంచి ప్రయాణించొచ్చు.

మరిన్ని వార్తలు