అతివల ఆకాశ స్వారీ

9 Mar, 2016 21:40 IST|Sakshi
అతివల ఆకాశ స్వారీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..
మహిళా సిబ్బందితో విమాన సర్వీసులు

న్యూఢిల్లీ/హైదరాబాద్:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ మహిళలే సిబ్బందిగా ఉన్న విమాన సర్వీసులను పలు విమానయాన కంపెనీలు నిర్వహించాయి.  ఎయిర్ ఇండియా సంస్థ అందరూ మహిళలే సిబ్బందిగా ఉన్న మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహించింది. జెట్ ఎయిర్‌వేస్, విస్తారా, స్పైస్‌జెట్ దేశీయ రూట్లలో ఈ తరహా విమాన సర్వీసులను నడిపించాయి. అందరూ మహిళలే సిబ్బందిగా ఉన్న 20 విమాన సర్వీసులను నడిపామని ఎయిర్ ఇండియా తెలిపింది.

కాగా అందరూ మహిళలే సిబ్బందిగా ఉన్న అధిక దూరం ప్రయాణించే విమాన సర్వీస్‌ను ఈ నెల 6 వ తేదీనే ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో రూట్‌లో నిర్వహించామని వివరించింది.  స్పైస్‌జెట్ సంస్థ అందరూ మహిళలే ఉన్న కాక్‌పిట్ క్రూతో పది విమాన సర్వీస్‌లను నిర్వహించింది. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన 20 మంది మహిళలను ఈ విమాన సర్వీస్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూర్ సెంటర్‌కు చేర్చామని స్పైస్‌జెట్ తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్  కంపెనీ ముంబై-ఢిల్లీ-ముంబై సెక్టర్‌లో అందరూ మహిళలే సిబ్బందిగా ఉన్న రెండు విమాన సర్వీసులను,  టాటా గ్రూప్‌కు చెందిన విస్తార విమానయాన సంస్థ నాలుగు విమాన సర్వీసులను నడిపించాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు