ఆర్థిక సంక్షోభం : జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఢమాల్‌

20 Mar, 2019 14:31 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ఎయిర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో  ఢమాల్‌ అంది.  బీఎస్‌ఈలో ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దాదాపు 6శాతం నష్టంతో రూ.215  వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ప్రస్తుతం 5శాతం నష్టంతో కొనసాగుతోంది.

ఇప్పటికే పీకల్లోతు అప్పుల కూరుకుపోయిన కంపెనీ నుంచి వైదొలగించేందుకు తన భాగస్వామ్య సంస్థ ఎతిహాత్‌  ప్రయత్నాలు చేస్తుంది. జెట్‌ ప్రివిలెజ్‌ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు ఎస్‌బీఐకి ఎతిహాద్‌ ఆఫర్‌ చేసినట్లు మంగళవారం వార్తలు వెలువడ్డాయి.

ఫలితంగా నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ ధర గత ముగింపు(రూ.229) తో పోలిస్తే దాదాపు 6శాతం నష్టంతో రూ.215  వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేర్ల అ‍మ్మకాలకే మొగ్గుచూపడంతో షేరు 7శాతం నష్టపోయి రూ.213.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:40ని.లకు షేరు గత ముగింపు(రూ.229.05) ధరతో పోలిస్తే షేరు ధర 5శాతం నష్టపోయి రూ.217.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.708.15లుగా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు