ఆ టికెట్లపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్‌

6 Jan, 2018 18:39 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ విమానయాన సంస్థ  జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రీమియర్‌ వన్‌ వే టికెట్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. ఎంపిక చేసిన  విమానాల్లో ప్రీమియం టికెట్లను రూ.2320(అన్నీ కలుపుకొని) లకే అందిస్తోంది. దేశీయ మార్కెట్లో నెలకొన్ని   తీవ్ర పోటీ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇలా బుక్‌ చేసుకున్న  అనంతరం 12నెలల పాటు చెల్లుబాటయ్యేలా నిర్ణయం తీసుకుంది.  ఎకానమీ క్లాస్‌ కంటే తక్కువ  రేటు విమాన టికెట్లతో ప్రయాణించండి, అదనపు  సౌలభ్యాలను ఆస్వాదించడంటూ  పేర్కొంది.  "ఫ్లై ప్రీమియర్ ఎట్ ఎకానమీ ఫేర్స్"  అని ప్రకటించింది.  దీంతోపాటు  44  ఇంచ్‌ పిచ్‌ పెద్ద సిక్స్‌ వే హెడ్‌సెట్‌ ఉచితంగా అందివ్వనుంది.

ఈ పథకం కింద తయారుచేసిన బుకింగ్స్ 12 నెలలు చెల్లుబాటవుతాయి. ప్రయానికి  కనీసం 30 రోజులు  ముందు టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఇండియాలో జెట్ ఎయిర్వేస్ నిర్వహిస్తున్న విమానాల్లో  ఎంపిక చేసిన ప్రీమియర్లో వన్-వే ప్రయాణాలకుఈ రేట్లు వర్తిస్తాయి.  ఎంపిక చేసుకున్న బుకింగ్ తరగతులకు, ఎలాంటి  ప్రయాణ ఆంక్షలు లేకుండా  డిస్కౌంట్‌  ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది.

చార్జీల నిబంధనల ప్రకారం పిల్లలు / శిశువుల తగ్గింపు, తేదీ మార్పు, విమాన మార్పు, వాపసు చార్జీలు, వారాంతపు సర్ఛార్జ్, బ్లాక్ అవుట్ కాలం, ప్రయాణ పరిమితి  / లేదా విమాన నియంత్రణ వంటివి వర్తిస్తాయి.

మరోవైపు అన్నింటినీ లేదా ఏదైనా నియమాలను లేదా షరతులను చేర్చడానికి, సవరించడానికి,  మార్చే అధికారంతోపాటు,  ఈ ఆఫర్‌ను పూర్తిగా లేదా కొంత భాగాన్ని మార్చడానికి, ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలో అయినా, ఆఫర్‌ను, పూర్తిగాలేదా పాక్షికంగా  ఉపసంహరించుకునే అధికారం తమకుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తగ్గింపు చార్జీల జాబితాను వెబ్‌సైట్లో ఉంచింది.

మరిన్ని వార్తలు