13 రూట్లలో విమాన సర్వీసులు రద్దు

23 Mar, 2019 08:27 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలు, రుణ భారంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రయివేటు విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది.  విమానాలకు అద్దెలు చెల్లించలేక, పైలెట్లకు జీతాలు చెల్లించలేక  పలు విమానాల రద్దు చేసుకుంటూ వస్తోంది. తాజా 13 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను రద్దు చేసింది. ఏప్రిల్‌ చివరివరకు ఈ నిర్ణయం అమలవుతుందని  ఎయిర్‌లైన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

అలాగే అద్దె బకాయిలు చెల్లించలేక మరో 7 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రద్దు చేసిన విమానాల సంఖ్య 54కు  చేరింది. ఇప్పటికే ముంబై -ఢిల్లీ మధ్య విమానాల  సర్వీసులను కూడా బాగా తగ్గించింది.  అలాగే  ముంబై -మాంచెస్టర్‌ మధ్య  సర్వీసులను ఇప్పటికే రద్దు చేసుకుంది.  

కాగా జీతాలు చెల్లించకుంటే వచ్చేనెలనుంచి విధులకు హాజరుకామని ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించారు. జీతాల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. మరోవైపు వందలాది మంది  పైలెట్లు  ఉద్యోగాలకోసం ఇతర విమానయాన సంస్థలను ఆశ్రయించిన సంగతి విదితమే. 

మరిన్ని వార్తలు