పదో రోజుకు జ్యువెలరీ సమ్మె

12 Mar, 2016 02:45 IST|Sakshi
పదో రోజుకు జ్యువెలరీ సమ్మె

న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ఆభరణాలు, బులియన్ వర్తకులు చేస్తున్న సమ్మె పదవ రోజుకు చేరింది. ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 2 నుంచి  జరుగుతోంది. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 1981, 2012ల్లో కూడా రత్నాలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.

 సురక్షిత సాధనంగా పుత్తడి: కాగా, ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ 670-685 టన్నులకు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్  అంచనా వేస్తోంది.  ఆభరణాల కంటే  నాణాలు, కడ్డీలకే డిమాండ్ బాగా ఉంటుందని పేర్కొంది.  ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులుండడం, స్టాక్ మార్కెట్లు బలహీనతలు, కరెన్సీ విలువలు తగ్గడం వల్ల సురక్షిత సాధనంగా పుత్తడి ఉంటుందని వివరించింది.

మరిన్ని వార్తలు