తొమ్మిదో రోజుకు చేరినజువెలర్స్ సమ్మె

10 Mar, 2016 00:46 IST|Sakshi
తొమ్మిదో రోజుకు చేరినజువెలర్స్ సమ్మె

పరిశ్రమకు రూ.60వేల కోట్లకు పైగా నష్టం!
ముంబై: జువెలర్స్ నిరవధిక సమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో ఇప్పటిదాకా జువెలరీ పరిశ్రమకు రూ.60,000 కోట్లకు పైగా ఆదాయపు నష్టం వచ్చింటుందని అంచనా. తాజా బడ్జెట్‌లోని ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని జువెలరీ ట్రేడ్ సహా ఇతర అనుబంధ వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 358 అసోసియేషన్స్‌కు చెందిన రిటైలర్లు, హోల్‌సెల్లర్స్, ఆభరణాల తయారీదారులు ఈ నెల 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు పాన్ నిబంధన తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వ చర్యనూ వ్యతిరేకిస్తున్నారు. జెమ్స్ అండ్ జువెలరీ రంగపు రోజూవారీ ఆదాయం రూ.7,000 కోట్లు గా ఉంటుందని, ఈ ప్రతిపాదికన ఇప్పటిదాకా రూ.60,000 కోట్లకుపైగా నష్టం వచ్చింటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ శ్రీధర్ తెలిపారు.

మరిన్ని వార్తలు