పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలి..

28 Jan, 2020 05:19 IST|Sakshi

ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ 

భారత్‌ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి.  
►బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్‌టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్‌ డైమండ్స్‌పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి.
►కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్‌ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి.  
►ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో  క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపునివ్వాలి.  
►పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్‌ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్‌ స్పాట్‌ ఎక్సే్చంజ్, బులియన్‌ బ్యాంకింగ్‌ మొదలైనవి పటిష్టం చేయాలి.

మరిన్ని వార్తలు