2020లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఐపీఓ! 

13 Dec, 2018 01:41 IST|Sakshi

ఇష్యూ సైజు రూ.4,500 కోట్లు

ముంబై: సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని సిమెంట్‌ విభాగం, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ 2020 కల్లా ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్‌ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించాలని జేఎస్‌డబ్ల్యూ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.8 మిలియన్‌ టన్నులుగా ఉంది. దీన్ని వచ్చే ఏడాదిమార్చి కల్లా 14 మిలియన్‌ టన్నులకు పెంచుకోనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీలేశ్‌ నర్వేకర్‌ పేర్కొన్నారు. 2020 కల్లా 20 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. సిమెంట్‌ ఉత్పత్తి ఈ స్థాయికి చేరాకే ఐపీఓకు వస్తామన్నారు. 

కంపెనీ విలువ రూ.18,000 కోట్లు
ఐపీఓకు వచ్చే నాటికి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కంపెనీ విలువ రూ.18,000 కోట్లుగా ఉండేలా చూసుకోవాలని లకి‡్ష్యంచినట్లు నీలేశ్‌ చెప్పారు. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు తమ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించే అవకాశం ఉందన్నారు. అంటే ఈ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, ఉత్పత్తి పెంచుకోవటానికి వినియోగిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు