మరింత పెరిగిన జిందాల్‌ స్టీల్‌ నష్టాలు

10 May, 2018 01:22 IST|Sakshi

న్యూఢిల్లీ: నవీన్‌ జిందాల్‌కు చెందిన జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (జేఎస్‌పీఎల్‌) కంపెనీ నష్టాలు క్యూ4లో మరింతగా పెరిగాయి. 2016–17 క్యూ4లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.100 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ సారి రూ.425 కోట్లకు పెరిగాయని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. వ్యయాలు, వడ్డీ భారం అధికం కావడమే దీనికి కారణమని వెల్లడించింది.

మొత్తం ఆదాయం రూ.6,756 కోట్ల నుంచి రూ.8,599 కోట్లకు ఎగసింది. వ్యయాలు రూ.7,074 కోట్ల నుంచి రూ.8,494 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే,  2016–17లో రూ.2,538 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,616 కోట్లకు తగ్గాయని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.22,706 కోట్ల నుంచి రూ.27,844 కోట్లకు పెరిగింది.

మరిన్ని వార్తలు