లాక్‌డౌన్.2 : జియో గుడ్ న్యూస్

20 Apr, 2020 12:55 IST|Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్ కష్టాల వేళ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్  న్యూస్ చెప్పింది. ప్రధానంగా మే 3వరకు లాక్‌డౌన్ పొడిగించిన వేళ జియో ప్రీపెయిడ్ చందాదారులు ఇన్‌కమింగ్ కాల్స్ స్వీకరిస్తూనే ఉండేలా ఊరటనిచ్చింది. రీచార్జ్ ప్లాన్ల గడువు ముగిసినప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్ విషయంలో జియో కస్టమర్లందరికీ ఎలాంటి అంతరాయం వుండదని ప్రకటించింది. తమ వినియోగ దారులదరికీ ఈ అవకాశం అందుబాటులో వుంటుందని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎప్పటివరకు ఈ చెల్లుబాటు అమల్లో వుంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే లాక్డౌన్ ప్రారంభం నుంచి గడువు ముగిసినా, రీచార్జ్ చేసుకోని ప్రతి ఒక్కరికీ పొడిగించిన చెల్లుబాటు లభిస్తుందో లేదో కూడా స్పష్టత లేదు. (జియో ఫైబర్:  రూ.199కే 1000 జీబీ డేటా)

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన చందాదారులందరికీ మే 5 వరకు ఇన్ కమింగ్ కాల్స్ చెల్లుబాటును పొడిగించిన తరువాత జియో  కూడా తన వినియోగదారులకు ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఎయిర్టెల్ కూడా మే 3వ తేదీ వరకు అన్ని ప్రీపెయిడ్ ఖాతాదారులకు ఇన్‌కమింగ్ కాల్స్ సేవల్లోఅంతరాయం వుండదని ప్రకటించింన సంగతి విదితమే. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం)

కాగా కరోనా మహమ్మారి విస్తరణ, లాక్ డౌన్ కారణంగా దేశీయ టెలికాం సంస్థలుఇప్పటికే వినియోగదారులకు పలు వెసులుబాట్లను కల్పించాయి. ప్రధానంగా ఏటీఎంల ద్వారా రీచార్జ్ చేసుకునే సౌలభ్యంతోపాటు, ఆన్ లైన్ రీచార్జ్ చేసుకోలేని వినియోగదారులకు రీచార్జ్  చేయడం ద్వారా సంబంధిత యూజర్ కమిషన్ పొందే ఆఫర్ ను కూడా తీసుకొచ్చాయి. (భారీగా తగ్గిన బంగారం ధర : ఈ అక్షయ తృతీయకు కొనేదెలా?)

మరిన్ని వార్తలు