భారీగా తగ్గనున్న జియో గిగా ఫైబర్‌ ధరలు

12 Jun, 2019 13:15 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

రూ.2,500 కే జియో గిగా ఫైబర్‌ కనెక్షన్‌!

పాత ప్లాన్‌పై రూ.2 వేలు తగ్గించిన జియో

వాయిస్‌ కాల్స్‌, జియో టీవీ సేవలు

సాక్షి,  న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలనాలు  నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలోనే బ్రాడ్‌ బ్యాండ్‌ రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పూర్తిగా మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వకుండానే  అందుబాటు ధరలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు  రేపుతోంది.  అటు  జియో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై యూజర్లలో భారీ హైప్‌ క్రియేట్‌ అవుతోంది.  తాజాగా మరింత చౌక ధరలో ఈ సేవలను అందుబాటులోకి  తీసుకు రానుంది. తద్వారా మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు ప్రణాళిలు సిద్ధం చేసింది. 

ప్రస్తుతం బీటా దశలోఉన్న ఈ సేవలు అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే గిగా ఫైబర్‌ ధర భారీగా తగ్గినట్టు మీడియాలో పలు అంచనాలు వెలువడుతున్నాయి.  గతానికంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్‌ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఇంకా వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించనప్పటికీ గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.  అలాగే, ఈ సేవల్ని పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లుగా  తెలుస్తోంది.  జియో  గిగా ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలకుగాను సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,500గా ఉంది.  ప్రస్తుతం దీన్ని  రూ.2 వేలు తగ్గింపుతో  రూ.2,500కే  గిగా ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తేనుంది.  అయితే  వేగాన్ని 50ఎంబీపీఎస్‌  తగ్గించినట్టు సమాచారం.

పాత ప్లాన్‌ప్రకారం రూ.4,500 కనెక్షన్‌తో డ్యుయల్ బ్యాండ్ రోటర్ అందిస్తుండగా , తాజా ప్లాన్‌లో రూ.2,500 కనెక్షన్ ప్లాన్‌తో సింగిల్  బ్యాండ్‌ వైఫై రోటర్‌ను అందివ్వనుంది.   అలాగే మొదటి ప్లాన్‌తో పోలిస్తే రెండో  ప్లాన్‌లో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్లాన్ వేగం 50ఎంబీపీఎస్ ఉంటే, రెండో ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండనుంది. అంటే సగం తగ్గనుందన్నమాట.  దీంతోపాటు  యూజర్లకు నెలకు 100 జీడీ డేటా, వాయిస్‌ కాల్స్‌ ఉచితం. అంతేకాదు జియో టీవీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ కాల్ సర్వీసు అందుబాటులో లేవు. అయితే తాజా ప్లాన్‌పై  జియో సంస్థ ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు.
 

>
మరిన్ని వార్తలు