శాంసంగ్‌ను బీట్‌ చేసి మరీ జియో సంచలనం

25 Jan, 2018 13:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రిలయన్స్‌ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్లో సునామీ సృష్టించిన రిలయన్స్‌ ..ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్‌లోకూడా  దూసుకుపోతోంది. తాజా నివేదికల  ప్రకారం జియో లాంచ్‌ చేసిన  ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ప్లేస్‌ కొట్టేసింది. స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ను బీట్‌ చేసి మరీ ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌లో అదరగొట్టింది. 27శాతం మార్కెట్‌ వాటాతో రిలయన్స్‌ ‘జియోఫోన్‌’ బ్రాండ్‌  అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. 2017 నాలుగో త్రైమాసికంలో తయారీ సంస్థల నుంచి సరఫరా (షిప్‌మెంట్‌)లను పరిగణనలోకి తీసుకుని, ఈ నివేదికను సంస్థ రూపొందించింది.   దీంతో రిలయన్స్‌ రీటైల్‌   మార్కెట్‌ లీడర్‌గా నిలిచిందని పేర్కొంది.   అంతేకాదు  సౌత్‌ కొరియన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది.  శాంసంగ్‌  మార్కెట్‌వాటా 17శాతంతో రెండవ స్థానంతో  సరిపెట్టుకుంది.   9శాతంతో మైక్రోమాక్స్‌ మూడవ స్థానంలో నిలిచింది.

అక్టోబరు-డిసెంబరు  త్రైమాసికం చివర్లో  రూ.1,500 విలువైన జియో 4జీ ఫీచర్‌ ఫోన్ల విక్రయాలు అధికంగా జరిగాయని, గిరాకీ-సరఫరాల మధ్య అంతరాయాన్ని నివారించగలిగిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఈ ఫోన్‌కు 60 లక్షల ముందస్తు బుకింగ్‌లు లభించాయని నివేదించింది. ముఖ‍్యంగా సాధారణ ఫీచర్‌ఫోన్‌ వాడే వినియోగదారులు, ఈ జియో 4జీ  ఫీచర్‌ ఫోన్‌ ద్వారా 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్‌  కావాలని భావించడమే జియోఫోన్‌   గ్రోతఖ్‌కు కారణాలని కౌంటర్‌పాయింట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ తెలిపారు. నగదు వాపసు పొందడం ద్వారా, జియోఫోన్‌ను ఉచితంగా వినియోగించుకునే వీలు దక్కడం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు.  అలాగే జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌లో 153 రూపాయల రీచార్జ్‌ ప్లాన్‌లో  1 జీబీ డేటాను ఆఫర్‌ చేయడం కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుందని  తెలిపారు.

మరిన్ని వార్తలు