జూన్‌లో ‘జియో’ హవా

20 Aug, 2019 09:09 IST|Sakshi

82.6 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లు

41.75 లక్షల సబ్‌స్క్రైబర్లను

కోల్పోయిన వొడాఫోన్‌ ఐడియా

న్యూఢిల్లీ: నూతన సబ్‌స్క్రైబర్లను జతచేసుకుంటూ జర్నీని కొనసాగించడంలో ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని ‘రిలయన్స్‌ జియో’ వాయువేగంతో దూసుకెళ్తోంది. ఇటీవలే సబ్‌స్క్రైబర్ల పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండవ స్థానానికి చేరిన ఈ సంస్థ.. జూన్‌లో 82.68 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లను జతచేసుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జూన్‌లో వొడాఫోన్‌ ఐడియా 41.45 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 29,883 కస్టమర్లను వదులుకోవాల్సి వచ్చింది. జూన్‌ చివరినాటికి  మొత్తం సబ్‌స్క్రైబర్ల పరంగా.. వొడాఫోన్‌ ఐడియాకు 38.34 కోట్లు (32.9% మార్కెట్‌ వాటా), జియోకు 33.12 కోట్లు (28.42%), ఎయిర్‌టెల్‌కు 32.03 కోట్లు (27.49%) ఉన్నాయి.

మరిన్ని వార్తలు