టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకున్న జియో, ఐడియా

19 Dec, 2018 19:50 IST|Sakshi

4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో టాప్

4జీ  అప్‌లోడ్‌లో ఐడియా టాప్‌

స్వల‍్పంగా మెరుగైన ఎయిర్‌టెల్‌

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం  సంచలనం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది.  4జీ సర్వీస్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది.  టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్‌ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు  ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో జియో టాప్‌ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది.

యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్‌ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్  టాప్‌లో నిలిచింది. 

మరోవైపు సమీప ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఈ నెలలో కొంచెం మెరుగుపడింది. ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్‌ నమోదైంది. గత  నెలలో ఇది 9.5గా ఉంది. వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్‌  కూడా స్వల్పంగా మెరుగుపడింది. అక్టోబర్‌ 6.7 ఎంబీపీఎస్గాఉండగా.. ప్రస్తుత నెలలో 6.8స్థాయికి పెరిగింది. ఐడియా సెల్యులార్  4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 6.4 నుంచి 6.2 కి పడిపోయింది.

అయితే అప్‌లోడ్‌ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్‌) తన టాప్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా.  సెకండ్‌ ప్లేస్‌లో వోడాఫోన్‌ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా ఎయిర్‌టెల్‌ స్వల్పంగా పుంజుకుంది.

అయితే యూజర్ల విషయంలో డౌన్‌లోడ్ స్పీడే చాలా ముఖ్యం. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్‌లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్‌లోడ్ స్పీడ్  చూస్తారు.  మైస్పీడ్ అప్లికేషన్‌లో రియల్ టైమ్ ఆధారంగా సగటు స్పీడ్ తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు