జియో: ఎగబాకిన వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు

10 Oct, 2019 18:13 IST|Sakshi

ముంబై : జియో షాకింగ్‌ నిర్ణయంతో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ పంట పండింది. వోడాఫోన్‌, ఐడియా ఏకంగా 18శాతం లాభదాయక షేర్లతో ఎగబాకింది. మరోవైపు ఎయిర్‌టెల్ 4.8  లాభదాయక షేర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఇతర నెట్‌వర్క్‌ల పై ఉచిత కాల్స్‌ సదుపాయాన్ని అందిస్తున్న జియో సంస్థ తాజాగా వేరే నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

జియో మాత్రం కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగిస్తామని పేర్కొంది. అయితే తమ సంస్థ  ప్రారంభించినప్పటి నుండి ప్రత్యర్థి ఆపరేటర్లకు వినియోగదారుల రుసుము 13,500 కోట్లు చెల్లించినట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో బిజినెస్‌ అనలిస్ట్‌ క్రిస్‌ లేన్‌ స్పందిస్తూ జియో లాభదాయక వృద్దిని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 

మరిన్ని వార్తలు