జియో గిగా ఫైబర్‌ రిజిస్ట్రేషన్లు షురూ : ధర, ఆఫర్లు

15 Aug, 2018 15:39 IST|Sakshi

సంచలనాల రిలయెన్స్ జియో నుంచి మరో సంచలన సర్వీస్‌ను  అందిస్తోంది. జియో అభిమానులు ఎంతోకాలంగా వేచి చూస్తున్న జియో గిగా ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జియో నేటి నుంచి ఫైబర్‌-టూ-ది-హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. మైజియో యాప్‌ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌ జియో.కామ్‌లలో జియోగిగాఫైబర్‌ నమోదు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ప్రీవ్యూ ఆఫర్‌ కింద జియో గిగా ఫైబర్‌ ఆల్ట్రా హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 90 రోజుల వరకు ఆఫర్‌ చేయనుంది. నెలవారీ డేటా కింద 100 జీబీని ఆఫర్‌ చేస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో హైస్పీడ్ వైఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగా టీవీ, స్మార్ట్‌హోమ్‌లాంటివి కూడా యాక్టివేట్ అవుతాయి.

ప్రస్తుతానికి జియో గిగాఫైబర్‌ను ఇళ్లలో ఉపయోగించే‌ వినియోగదారులకు నెలకు రూ.1000 ప్లాన్‌తో సెకనుకు వంద మెగాబిట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అందించనుంది. గృహ వినియోగదారులకు పది రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తామని జియో హామీ ఇచ్చింది. కాగా కంపెనీ ఈ గిగాఫైబర్‌ ధరను వెల్లడించలేదు. అయితే, గతంలో జియో విడుదలైనప్పుడు టెలికాం సంస్థల మధ్య భారీగా పోటీ ఏర్పడినట్లే ఇప్పుడు కూడా పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

జియో గిగా ఫైబర్‌  రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
జియో అధికారిక వెబ్‌సైట్‌కులాగిన్‌ అయ్యి  గిగాఫైబర్ పేజ్ ఓపెన్ చేయాలి
అక్కడున్న చేంజ్ బటన్‌పై ప్రెస్‌ చేసి అడ్రెస్‌ను  సబమిట్‌ చేయాలి.
అనంతరం డిఫాల్ట్‌ అడ్రెస్‌ డిస్‌ ప్లే అవుతుంది. ఇది మీ ఇంటి అడ్రెసా లేక ఆఫీస్ అడ్రెసా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి
ఆ తర్వాతి పేజీలో మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీ లొకాలిటీ (సొసైటీ, టౌన్‌షిప్, డెవలపర్‌లాంటివి) సెలెక్ట్ చేసి సబ్‌మిట్ చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.అలాగే  మీరు ఇతర ప్రాంతాలను కూడా నామినేట్ చేయొచ్చు. అంటే మీరు పని చేసే చోటు లేదా ఇతర స్నేహితులు, ఇంకా ఎవరిదైనా అడ్రెస్‌పై కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు.

ప్లాన్లను జియో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి.  ముఖ‍్యంగా రూ.500, రూ.750, రూ.999, రూ.1299, రూ.1599 గా ఉంచవచ్చని అంచనా.
రూ .500 ప్లాన్‌ : ఇది జియోగిగాఫైబర్‌లో  మొదటి ప్యాకేజి. ఇందులో  50ఎంబీపీఎస్‌ వేగంతో  నెలకు 300జీబీ వరకు అపరిమిత డేటా
రూ. 750 ప్లాన్‌: 50ఎంబీపీఎస్‌ వేగంతో  నెలకు 450 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ
రూ 999ప్లాన్‌: 100ఎంబీపీఎస్‌ వేగంతో  నెలకు600 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ
రూ 1,299 ప్లాన్‌: 100ఎంబీపీఎస్‌ వేగంతో  నెలకు750  జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ
రూ 1,599 ప్లాన్‌ 150ఎంబీపీఎస్‌ వేగంతో  నెలకు900 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ

కాగా టెలికాం మార్కెట్‌లో 4జీ సేవల అనంతరం జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనున్నామని గత నెలలో జరిగిన 41వ వార్షిక సాధారణ సమావేశంలో రిలయన్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.  ఏ నగరం నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు వస్తాయో అక్కడ నుంచి మొదటగా గిగాఫైబర్‌ సేవలు అందించనున్నట్లు రిలయన్స్‌ వెల్లడించింది. ఈ సేవలను మొత్తం 1100 నగరాల్లో ప్రారంభిస్తామని గత నెల రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు