జేఎమ్ ఫైనాన్షియల్ లాభం 19% వృద్ధి

3 Aug, 2016 02:17 IST|Sakshi
జేఎమ్ ఫైనాన్షియల్ లాభం 19% వృద్ధి

న్యూఢిల్లీ: జేఎమ్ ఫైనాన్షియల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.86 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్) ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.72 కోట్లు)తో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.383 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.475 కోట్లకు పెరిగిందని జేఎమ్ ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్ నిమేశ్ కంపాని చెప్పారు.కంపానీకి 70 ఏళ్లు నిండినందున సెప్టెంబర్ 30 నుంచి ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి ఆయన రిటైర్‌అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు