దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన

26 Oct, 2019 15:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమందగమనం, వినియోగదారుల డిమాండ్‌ పడిపోతున్న నేపథ్యంలో మరో షాకింగ్‌ న్యూస్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై  మాసంతో పోలిస్తే, ఆగస్టుమాసంలో ఉద్యోగాల కల్పన దారుణంగా పడిపోయింది.  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) పేరోల్ డేటా ప్రకారం ఆగస్టులో సుమారు 13 లక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రం రాగా, అంతకుముందు నెలలో (జూలై) ఈ సంఖ్య 14.49 లక్షలు.

2018-19లో ఇఎస్‌ఐసితో కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) ఒక నివేదికలో తెలిపింది. 2017 సెప్టెంబర్ నుండి 2019 ఆగస్టు వరకు సుమారు 2.97 కోట్ల మంది కొత్త చందాదారులు ఈ పథకంలో చేరినట్లు కూడా  నివేదిక వివరించింది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ  నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్‌ఎస్‌ఓ నివేదికను రూపొందిస్తుంది. 

సెప్టెంబర్ 2018 నుండి ప్రారంభమయ్యే కాలాన్ని కవర్ చేస్తూ ఏప్రిల్ 2018 నుండి ఈ మూడు సంస్థల పేరోల్ డేటా లేదా కొత్త చందాదారుల డేటాను విడుదల ఎన్‌ఎస్‌ఓ చేస్తోంది.  దీని ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు ఇఎస్ఐసీ లో కొత్త నమోదులు 83.35 లక్షలుగా ఉందని నివేదిక చూపించింది. ఈ ఏడాది జూలైలో 11.71 లక్షలతో పోలిస్తే ఆగస్టులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) తో 10.86 లక్షల  కొత్త  ఉద్యోగాలు మాత్రమే  నమోదయ్యాయి. 2018-19లో నికర ప్రాతిపదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఇపిఎఫ్‌ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో చేరారు. అదేవిధంగా, నికర కొత్త నమోదులు (సెప్టెంబర్ 2017 - మార్చి 2018 వరకు) 15.52 లక్షలు.  కాగా  సెప్టెంబర్ 2017 - 2019 ఆగస్టులో  ఇపీఎఫ్ పథకంలో చేరిన  కొత్త చందాదారులు సుమారు 2.75 కోట్ల మంది. చందాదారుల సంఖ్య వివిధ వనరుల నుండి వచ్చినందున, ఈ అంచనాలు సంకలితం కాదని  ఎన్‌ఎస్‌ఓ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు