భారత్‌కు అతిపెద్ద సవాలు అదే!

22 Jul, 2017 18:50 IST|Sakshi
భారత్‌కు అతిపెద్ద సవాలు అదే!
న్యూఢిల్లీ : ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి భారత్‌ తక్షణమే కార్మిక సంస్కరణలు చేపట్టాల్సి ఉందని సింగపూర్‌ డిప్యూటీ ప్రధానమంత్రి థర్మాన్ షణ్ముగరత్నం అన్నారు. దీంతో జనాభా సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ''భారత్‌ అతిపెద్ద సవాలు ఉద్యోగ సృష్టి. మున్ముందు కూడా ఇదే అసలైన ఛాలెంజ్‌ ఎందుకంటే ఇప్పటికే భారత్‌ చాలా సమయాన్ని కోల్పోయింది'' అని ఆయన ఢిల్లీ ఎకనామిక్స్‌ కంక్లేవ్‌లో చెప్పారు. ఒకవేళ కార్మిక సంస్కరణలను వెంటనే చేపట్టకపోతే, వచ్చే కొన్నేళ్లలో దేశం అసలైన సమస్యను ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు. నైపుణ్యవంతులైన ఉద్యోగులు తగ్గిపోతుడటంతో, చట్టసభ్యులు వెంటనే మేల్కొని వీటిపై ఏదైనా చర్యలు తీసుకోవాలని లేదా రానున్న కాలంలో జనాభా డివిడెండ్‌, జనాభా సంక్షోభమవుతుందని షణ్ముగరత్నం తెలిపారు.  
 
మూలధన పెట్టుబడులను ప్రోత్సహించడం, వాటిని నైపుణ్యవంతులను తయారుచేయడంలో పెట్టుబడులుగా పెట్టడంతో బ్యాలెన్సింగ్‌ను రూపొందించవచ్చని పేర్కొన్నారు. మంచి ఆర్థిక వ్యవస్థకు రాజకీయ మద్దతు కల్పించడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోవాలని, భారత సంప్రదాయాల్లో చాలా మార్పులు వచ్చాయని అవి ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. అవినీతిని భారత్‌ నిర్మూలిస్తుందని, జీఎస్టీ కేవలం ఆర్థిక లేదా రాజకీయ దృక్పథమే కాదని, ఇది ఎంతో మెచ్చుకోదగినదని కొనియాడారు. ఇటీవల కాలంలో మంచి ఆర్థికవ్యవస్థకు భారత్‌ కల్పిస్తున్న రాజకీయ మద్దతు పాఠంలా ఉందని షణ్ముగరత్నం అభివర్ణించారు.   
మరిన్ని వార్తలు