ఐటీయూలో భారత్‌కు మళ్లీ సభ్యత్వం..

7 Nov, 2018 00:30 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్‌ యూనియన్‌ కౌన్సిల్‌ (ఐటీయూ)లో భారత్‌ మళ్లీ సభ్యత్వం దక్కించుకుంది. 2019 నుంచి 2022 దాకా నాలుగేళ్ల పాటు ఈ సభ్యత్వం ఉంటుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.

దుబాయ్‌లో ఐటీయూ సదస్సు సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌కు 165 ఓట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసియా–ఆస్ట్రలేషియా ప్రాంతం నుంచి ఎన్నికైన 13 దేశాల్లో భారత్‌ మూడో ర్యాంక్‌లో నిల్చిందని, అంతర్జాతీయంగా మొత్తం 48 దేశాల జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుందని సిన్హా వివరించారు.

మరిన్ని వార్తలు