తగ్గిన జేఎస్‌పీఎల్‌ నష్టాలు

9 Aug, 2017 01:08 IST|Sakshi

న్యూఢిల్లీ: అధిక ఆదాయాల దన్నుతో నవీన్‌ జిందాల్‌ గ్రూపులో భాగమైన జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) జూన్‌ త్రైమాసికంలో నష్టాలను గణనీయంగా తగ్గించుకుంది. రూ.420 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.1,238 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆదాయం గతేడాది ఇదే కాలంలో పోల్చి చూసుకుంటే 19.5 శాతం పెరుగుదలతో రూ.6,126 కోట్లకు చేరింది. పన్నుకు ముందస్తు లాభం 63 శాతం మెరుగుపడినట్టు కంపెనీ తెలిపింది. ఇక జూన్‌ క్వార్టర్‌ నాటికి నికర రుణ భారం అంతకుముందు త్రైమాసికం స్థాయిలోనే కొనసాగింది. స్టీల్‌ ఉత్పత్తి 1.26 మిలియన్‌ టన్నులుగా ఉంది. కంపెనీ సబ్సిడరీ జిందాల్‌ పవర్‌ లిమిటెడ్‌ పనితీరు మెరుగుపడింది.

నిధుల సమీకరణ
ఇక కంపెనీ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది. అధీకృత మూలధనం ప్రస్తుతమున్న రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచేందుకూ బోర్డు అంగీకారం తెలిపింది.

>
మరిన్ని వార్తలు