కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ నుంచి మూడు కొత్త సర్వీసులు

9 Mar, 2017 01:57 IST|Sakshi
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ నుంచి మూడు కొత్త సర్వీసులు

చెన్నై: వినియోగదారులకు బ్యాంకింగ్‌ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ తాజాగా మూడు కొత్త టెక్నాలజీ సర్వీసులను ప్రారంభించింది. ఫాస్టాగ్, యూపీఐ, బీబీపీఎస్‌ అనే సేవలను ఆవిష్కరించింది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఫాస్టాగ్‌ సేవలను ఆవిష్కరించామని బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కె.వెంకటరమణ్‌ తెలిపారు.

‘ముందుగానే లోడ్‌ చేసిన ట్యాగ్స్‌ను వాహనాలకు అతికిస్తా రు. టోల్‌ప్లాజాలు సెన్సార్ల సాయంతో టోల్‌ అమౌంట్‌ను ఈ ట్యాగ్స్‌ ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్‌ చేసుకుంటాయి. తర్వాత ట్యాగ్స్‌ను డబ్బులతో మళ్లీ నింపుకోవచ్చు. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌ప్లాజాల వద్ద అనుమతిస్తారు’ అని వివరించారు. అలాగే మొబైల్‌ ద్వారా ఇంటర్‌బ్యాంక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం ‘కేవీబీ యూపీఐ’ యాప్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ఇక భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌) ద్వారా యూజర్లు యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు