కార్వీ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ

1 Jan, 2020 03:03 IST|Sakshi

ఆర్థిక, ఆర్థికేతర సర్వీసులు విభాగాల కింద విభజన

ఆర్థిక సేవల విభాగానికి గ్రూప్‌ సీఈవోగా అమితాబ్‌ చతుర్వేది

హైదదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్‌ .. తాజాగా వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసులుకింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్‌ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా స్టాక్‌ బ్రోకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, కమోడిటీల ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ తదితర వ్యాపారాలను ఆరి్థక సేవల విభాగం కింద చేర్చనున్నట్లు కార్వీ వివరించింది. అలాగే, డేటా మేనేజ్‌మెంట్‌ సేవలు, డేటా అన లిటిక్స్, మార్కెట్‌ రీసెర్చ్, అనుబంధ వ్యాపారాలు..

ఆర్థికేతర విభాగం పరిధిలో ఉంటాయని పేర్కొంది. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపింది. ఆరి్థక సేవల వ్యాపార విభాగం గ్రూప్‌ సీఈవోగా అమితాబ్‌ చతుర్వేది నియమితులైనట్లు కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి. పార్థసారథి తెలిపారు. ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌లో సుమారు మూడు దశాబ్దాలపైగా అనుభవం ఉన్న చతుర్వేది సారథ్యంలో సంస్థ కొత్త శిఖరాలు అధిరోహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చతుర్వేది గతంలో ధనలక్ష్మి బ్యాంక్, రిలయన్స్‌ ఏఎంసీ, ఐసీఐసీఐ, ఎస్సెల్‌ గ్రూప్‌ తదితర సంస్థల్లో పనిచేశారు. కార్వీ బ్రాండ్‌ను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా నిధుల సమీకరణతో సంస్థను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని చతుర్వేది తెలిపారు.

మరిన్ని వార్తలు