కృష్ణపట్నంలో క్రిభ్‌కో ఎరువుల ప్లాంటు

24 Sep, 2015 00:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎరువుల తయారీ సంస్థ క్రిషక్ భారతీ కోఆపరేటివ్ (క్రిభ్‌కో) తాజాగా రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఫాస్ఫరిక్, పొటాషిక్ ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇప్పటిదాకా యూరియా మాత్రమే ఉత్పత్తి చేస్తున్న క్రిభ్‌కోకి ఇది తొలి పీఅండ్‌కే ఎరువుల ప్లాంటు కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేళ్ల పాటు రూ. 1కే యూనిట్ విద్యుత్‌ను, ఏడేళ్ల పాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) నుంచి మినహాయింపుతో పాటు పలు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకొచ్చిందని క్రిభ్‌కో చైర్మన్ చంద్రపాల్ సింగ్ తెలిపారు. వీటివల్ల సంస్థకు దాదాపు రూ. 500 కోట్ల మేర ప్రయోజనం చేకూరగలదని, అందుకే ప్లాంటు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నామని ఆయన వివరించారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 6 లక్షల టన్నులుగా ఉంటుం దని, ప్రాజెక్టు అందుబాటులోకి రావడానికి 4-5 సంవత్సరాలు పడుతుందని సింగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు