మారుతి బాస్‌గా మళ్లీ ఆయనే

28 Mar, 2019 10:29 IST|Sakshi

మారుతి సుజుకి సీఈవోగా మళ్లీ కెనిచి

2013 నుంచి సీఈవోగా ఉన్న  కెనిచి హాట్రిక్‌

సాక్షి, ముంబై:  దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎండి, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారని  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  తెలిపింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కెనిచిని తిరిగి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

కెనిచి నియామకం 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.  2013 మార్చిలో ఆయన సీఈవోగా  బాధ్యతలు చేపట్టారు. తాజాగా అవకాశంతో మూడోసారి కూడా   మరోవమూడుళ్లపాటు కెనిచి సీఎండీగా కొనసాగనున్నారు. 

మరిన్ని వార్తలు