అనుమతులు ఉపసంహరణ, డీఎల్ఎఫ్ కు ఎదురుదెబ్బ!

18 Jun, 2014 15:54 IST|Sakshi
అనుమతులు ఉపసంహరణ, డీఎల్ఎఫ్ కు ఎదురుదెబ్బ!
తిరువనంతపురం: ప్రతిపక్షాల ఆందోళనకు తలవొంచిన కేరళ ప్రభుత్వం డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కు మంగళం పాడింది. నిబంధనలకు విరుద్దంగా కోచి లో డీఎల్ఎఫ్ చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణ పనులు రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. కేవలం లబ్ది పొందడానికే కాంగ్రెస్, యూడీఎఫ్ ప్రభుత్వం డీఎల్ఎఫ్ కు అనుమతిచ్చిందని  ప్రతిపక్ష ఎల్ డీఎఫ్ ఆరోపణలు చేసింది. దాంతో ఈ ప్రాజెక్ట్ పనులను రద్దు చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్దర్వులు జారీ చేసింది.  
 
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి లబ్ది చేకూర్చడానికే డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చారని ఎల్ డీఎఫ్ ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని, రాజకీయంగా లబ్ది పొందడానికే డీఎల్ఎఫ్ కు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతిచ్చారని ఎల్ డీఎఫ్ ధర్నా నిర్వహించింది.
 
 గత ఏప్రిల్ లో పర్యావరణ శాఖ ఇచ్చిన క్లియరెన్స్ మేరకే ఈ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చామని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, పర్యావరణ శాఖ రాధాకృష్ణన్ నోటిసులకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహరంపై ఐదు రోజులుగా రిపోర్టు సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి చాందీ కోరారు. 
మరిన్ని వార్తలు