హైదరాబాద్‌లో కెవెంటర్స్‌ ఔట్‌లెట్లు

17 Nov, 2017 00:31 IST|Sakshi

2019 నాటికి 32 స్టోర్ల ఏర్పాటు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ డెయిరీ బ్రాండ్‌ కెవెంటర్స్‌... హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించింది. తొలుత సుజనా ఫోరం, జీవీకే, ఇనార్బిట్‌లలో మూడు ఔట్‌లెట్లను ప్రారంభించిన ఈ సంస్థ... 2019 చివరి నాటికి నగరవ్యాప్తంగా 32 స్టోర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, డైరెక్టర్‌ షోరభ్‌ సీతారామ్‌ మాట్లాడుతూ.. థిక్, క్లాసిక్, ఫ్రూటీ షేక్స్‌లలో 27 రకాల పానీయాలను అందుబాటులో ఉంచామని, వీటి ధరలు రూ.99 నుంచి 250 వరకు ఉంటాయని తెలిపారు. ‘‘ప్రస్తుతం దేశంలో 30 ప్రాంతాల్లో 170, నేపాల్, యూఏఈ దేశాల్లో 12 ఔట్‌లెట్లున్నాయి.

వీటిల్లో 20 శాతం మాత్రమే సొంతవి. మిగిలినవన్నీ ఫ్రాంచైజీ విధానంలో ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. 2019 ముగింపు నాటికి దేశ, విదేశాల్లో కలిపి వీటి సంఖ్యను 1,500లకు చేర్చాలని లకి‡్ష్యంచినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కెవెంటర్స్‌ స్టోర్లకు పాల ఉత్పత్తుల సరఫరా కోసం మదర్‌ డెయిరీతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.32 కోట్ల వ్యాపారాన్ని చేశామని, ఈ ఏడాది రూ.75 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచామని తెలిపారు.

మరిన్ని వార్తలు