స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

27 Jun, 2016 10:25 IST|Sakshi

ముంబై:   బ్రెగ్జిట్ ప్రకంపనల  అనంతరం సోమవారం నాటి దేశీయ  మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 స్క్రిప్టుల సెన్సిటివ్ ఇండెక్స్ ( సెన్సెక్స్ ), 53 పాయింట్ల నష్టంతో 26,347 దగ్గర ప్రారంభం కాగా, నిఫ్టీ  17  పాయింట్లనష్టంతో 8.071 పాయింట్ల దగ్గర ప్రారంమైంది,గ్లోబల్ మార్కెట్ల అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో  భారత ఈక్విటీ సూచీలు స్వల్పం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  మదుపర్లు వేచి   చూసే ధోరణిని  కొనసాగించే అవకాశం ఉందిన విశ్లేషకుల అంచనా. అటొ రంగం  నష్టాల్లో ఉండగా, ఆయిల్ రంగంపాజిటివ్ ట్రెండ్ లో ఉంది.  ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్ , ఇన్ ఫ్రా సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.  వాతావరణ సూచనలతో  కొనుగోళ్ల మద్దతులభించే అవకావం ఉందని భావిస్తున్నారు.


మరోవైపు దేశీయ కరెన్సీ,  పుత్తడి  పాజిటివ్ గా ఉన్నాయి. డాలర్ తో  పోలిస్తే రూపాయి 12 పైసలు లాభపడి 67.84 దగ్గర ఉంది.  మిగతా కరెన్సీలతో  పోలిస్తే డాలర్  బలపడటం  రూపాయి కోలుకుందని ఎనలిస్టులు అంటున్నారు.  అటు  ఈరోజుకూడా పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి.  200  రూ.  లాభంతో పది గ్రా. 31,605 దగ్గర ఉంది. దీంతో జ్యువెల్లరీ షేర్ల లాభాలుకొనసాగుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు