4శాతం డిస్కౌంట్‌తో ఖాదిమ్‌ లిస్టింగ్‌

14 Nov, 2017 14:23 IST|Sakshi

సాక్షి,ముంబై:  పబ్లిక్ ఆఫర్  (ఐపీవో) లో ఒకే అనిపించుకున్న  దేశీయ ఫుట్‌వేర్‌ సంస్థ ఖాదిమ్‌ ఇండియా లిస్టింగ్‌లో నిరుత్సాహపర్చింది. ఈ నెల తొలి వారంలో పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న  ఖాదిమ్‌ ఇండియా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో  లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 750కాగా.. ఎన్‌ఎస్‌ఈలో 3.6 శాతం నష్టంతో రూ. 723వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది.
ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 543 కోట్లను సమీకరించింది.ఇష్యూలో భాగంగా ఖాదిమ్‌ ఇండియా  ప్రమోటర్‌ సిద్దార్థ రాయ్‌ బర్మన్‌ 7.22 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించగా.. ఫెయిర్‌విండ్స్‌ ట్రస్టీస్‌ 58.52 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల  నుంచి రూ. 157.5 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 750 ధరలో 13 యాంకర్‌ సంస్థలకు షేర్లను కేటాయించింది. 

కాగా దక్షిణ భారతదేశంలో మూడవ అతిపెద్ద  ఫుట్‌ వేర్‌ సంస్థగా ఉన్న ఖాదిమ్‌   ఇప్పుడు పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ఖాదిమ్‌ ఇండియా ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.  1981లో ఏర్పాటైన
కంపెనీ ఖాదిమ్‌ బ్రాండ్‌తో ప్రధానంగా ఫుట్‌వేర్‌ తయారీ, విక్రయాలను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు