ఇదిగో... కియా ‘సెల్టోస్‌’

21 Jun, 2019 11:25 IST|Sakshi

నాల్గవ త్రైమాసికంలో కారు విడుదల

ధరల శ్రేణి రూ.10 – 17 లక్షలు

గురుగ్రామ్‌: దక్షిణ కొరియా ఆటో రంగ సంస్థ కియా మోటార్స్‌ తన ప్రీమియం కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘సెల్టోస్‌’ కారును గురువారం ఇక్కడ ప్రదర్శించింది. భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కారును రూపొందించి, అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కంపెనీకి ఉన్న ప్లాంట్‌ నుంచే మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలతో పాటు ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేసింది. ఈ ఏడాది నాల్గవ త్రైమాసికంలో కారు విడుదల కానుండగా.. ధరల శ్రేణి రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షలుగా వెల్లడించింది. బీఎస్‌–6 ప్రమాణాలతో రూపొందించిన ఈ కారు పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభ్యంకానుంది. మూడు ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లతో పాటు సిక్స్‌–స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వెర్షన్లతో అందుబాటులోకి రానుంది.

భారత్‌లో రూ.13,896 కోట్ల పెట్టుబడి
సెల్టోస్‌ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హాన్‌–వూ పార్క్‌ మాట్లాడుతూ.. ‘వచ్చే రెండేళ్లలో అనంతపురం ప్లాంట్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉత్పత్తి కానున్నాయి. వీటిలో సెల్టోస్‌ ఒకటి కాగా, దేశవ్యాప్తంగా 160 నగరాల్లో 265 టచ్‌ పాయింట్లతో మా ప్రస్థానం మొదలుకానుంది. 2020 నాటికి ఈ సంఖ్య 300 వద్దకు చేరుకోవాలనేది కంపెనీ లక్ష్యం. ఆ తరువాత 2021 నాటికి 350కి పెంచనున్నాం. భారత్‌లో ఇప్పటివరకు 2 బిలియన్‌ డాలర్లు (రూ.13,896 కోట్లు) మేర పెట్టుబడిపెట్టాం. ఇందులో ఒక్కప్లాంట్‌ కోసమే 1.1 బిలియన్‌ డాలర్లు (రూ.7,643 కోట్లు) పెట్టుబడిపెట్టగా.. ఏడాదికి మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది’ అని తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు