కింభో యాప్‌ మళ్లీ తుస్సు

28 Aug, 2018 11:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స‍్వదేశీ యాప్‌ అంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్నపతంజలి మెసేజింగ్‌ యాప్‌ లాంచింగ్‌ మళ్లీనిరాశపర్చింది. తొందరలోనే అధికారిక లాంచింగ్‌పై తేదీని ప్రకటిస్తామని పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణ ట్విటర్‌ ద్వారా సోమవారం వెల్లడించారు. అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన యాప్‌ను అందించేందుకు ట్రయల్స్‌, రివ్యూలు అప్‌ గ్రేడేషన​  ప్రాసెస్ చేస్తున్నాం.  అధికారికంగా లాంచింగ్‌ తేదీని ప్రకటిస్తామంటూ ఆయన ట్వీట్‌ చేశారు. భద్రతాలోపం కారణంగా గూగుల్‌ నుంచి మిస్‌ కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 27న అధికారికంగా కస్టమర్ల ముందుకు రానున్నామని ప్రకటించిన  కింభో యాప్‌ లాంచింగ్‌ మళ్లీ తుస్సుమంది.

కాగా ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం  సొంతమైన వాట్సాప్‌కు పోటీగా స్వదేశీయ  ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌ కింభో పేరుతో విడుదల చేయనున్నామని దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ప్రకటించింది. కానీ భద్రతా కారణాల ర్యీతా గూగుల్‌  ప్లే స్టోర్ నుంచి అదృశ్యమయ్యింది.  అయితే  అభివృద్ది పరిచిన గోప్యతా విధానంతో  ఆగస్టు 27న అధికారికంగా లాంచ్‌ కాబోతోందని మళ్లీ పతంజలి ఎండీ బాలకృష‍్ణ ట్విటర్‌లో ప్రకటించారు. ఆగష్టు 15న టెస్టింగ్‌ వెర్షన్‌గా డౌన్‌లోడింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.  అయితే రెండవసారి కూడా  గోప్యతా కారణాల రీత్యానే గూగుల్‌  ప్లే స్టోర్ నుంచి  అదృశ్యం కావడం  గమనార్హం.

మరిన్ని వార్తలు