కేకేఆర్‌ చేతికి రామ్‌కీ ఎన్విరో!

12 Feb, 2019 00:59 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో (ఆర్‌ఈఈఎల్‌) అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ 60 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇదివరలోనే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదరగా... ఈ లావాదేవీ ప్రక్రియ సోమవారం పూర్తయినట్లు ఇరు కంపెనీల ప్రతినిధులూ ప్రకటించారు. రామ్‌కీ ఎన్విరోలో ప్రైమరీ, సెకండరీ పెట్టుబడులు కలిపి రూ.3,630 కోట్లను కేకేఆర్‌ ఇన్వెస్ట్‌ చేసింది. గ్లోబల్‌ ఇంపాక్ట్‌ స్ట్రాటజీలో భాగంగా కేకేఆర్‌ ఏసియన్‌ ఫండ్‌–3 నుంచి ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు కేకేఆర్‌ ఎండీ రూపేన్‌ ఝవేరీ తెలియజేశారు.

సామాజికంగా, పర్యావరణ పరంగా ప్రభావాన్ని చూపించగలిగే వ్యాపారాలను గుర్తించడం, పెట్టుబడులు పెట్టడం కోసం గ్లోబల్‌ ఇంపాక్ట్‌ స్ట్రాటజీని ఏర్పాటు చేశామని ఝవేరీ చెప్పారు.  ప్రపంచంలోనే వ్యర్థాల నిర్వహణ అవసరం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని... ఈ విషయంలో దేశవ్యాప్తంగా పరిష్కారాలను, సేవలను అందిస్తూ రామ్‌కీ కీలక పాత్ర పోషిస్తున్నదని రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ ఎండీ, సీఈఓ ఎం.గౌతమ్‌ రెడ్డి చెప్పారు. పర్యావరణ సవాళ్లకు ప్రభావశీలమైన పరిష్కారాలను అందించడంలో, సానుకూల మార్పు తీసుకురావాలనే భావ సారూప్యత కారణంగా కేకేఆర్‌ సంస్థ తమకు మంచి భాగస్వామి కాగలదని  విశ్వాసం వ్యక్తం చేశారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమలో దేశంలోనే ఇది అతిపెద్ద డీల్‌ అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడాదిలో ఐపీఓకి! 

రీట్, ఇన్విట్‌లకు ఇక డిమాండ్‌!

మూడో రోజు మార్కెట్లకు నష్టాలే

చైనాలో అమెజాన్‌ ఈ–కామర్స్‌ సేవలు నిలిపివేత

ఏసీసీ లాభం జూమ్‌

కొత్త ‘ఆల్టో 800’  

మార్కెట్లోకి హోండా ‘అమేజ్‌’ కొత్త వేరియంట్‌

జెట్‌ పునరుద్ధరణపై ఆశలు

ఫార్మా ఎగుమతులు 11% అప్‌

ఇరాన్‌ చమురుకు చెల్లు!

బంపర్‌ ఆఫర్‌తో జియో గిగాఫైబర్‌!

జియోలోకి సాఫ్ట్‌బ్యాంక్‌ ఎంట్రీ!

వరంగల్‌లో రిల‌య‌న్స్ స్మార్ట్‌ స్టోర్‌

మలబార్‌ గోల్డ్‌ ‘బ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’

బజాజ్‌ నుంచి ‘హెల్త్, లైఫ్‌’ పాలసీ

మహింద్రా లైఫ్‌స్పేస్‌  లాభం 35 శాతం డౌన్‌ 

వెబ్‌సైట్, యాప్‌ లేకపోయినా చెల్లింపులు

పవన్‌హన్స్‌లో ఆగిన వాటాల విక్రయం

మార్కెట్లకు చమురు సెగ 

రెండు వారాల  కనిష్టానికి రూపాయి

హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్‌ డేటా సెంటర్‌ 

స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ ‘బాలెనో’ 

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి హైదరాబాద్‌ కంపెనీ?

ఎస్‌బీఐ జనరల్‌ నుంచి సైబర్‌ బీమా పాలసీ

బ్లాక్‌స్టోన్‌ చేతికి ఎస్సెల్‌ ప్రోప్యాక్‌

జెట్‌ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి

సెప్టెంబర్‌ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!

లైవ్‌ క్లాస్‌లతో కాసుల వర్షం

హోండా ‘సీబీఆర్‌650ఆర్‌’ స్పోర్ట్స్‌ బైక్‌ 

ఇరాన్‌ చమురుపై భారత్‌కు షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్వీట్‌ సర్‌ప్రైజ్‌

ట్రైలర్‌ బాగుంది  – ప్రభాస్‌

సగం దూరం వచ్చాం

జెర్సీలాంటి చిత్రాలు జీవితాంతం గుర్తుండిపోతాయి

లవ్‌ లాకప్‌

‘దేవుడు ఇలా రివేంజ్‌ తీర్చుకున్నాడు.. చై’