-

రియల్టీ పట్టాలెక్కింది!

8 Jul, 2016 22:34 IST|Sakshi
రియల్టీ పట్టాలెక్కింది!

ఈ ఏడాది తొలి 6 నెలల్లో భాగ్యనగర నిర్మాణ రంగం వృద్ధి
7,700 ఫ్లాట్ల విక్రయం; 2.8 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు
కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభంలోనే కొంత క్షీణత    
నైట్ ఫ్రాంక్ ఇండియా ఐదో సంచిక నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే 2016 తొలి ఆరు నెలల్లో హైదరాబాద్‌లో నివాస సముదాయాల అమ్మకాలు 8 శాతం, ఆఫీస్ స్పేస్ మార్కెట్ 91 శాతం వృద్ధిని నమోదు చేశాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఐదో సంచిక (జనవరి-జూన్ హెచ్1 2016) నివేదిక వెల్లడించింది.  నూతన గృహ ప్రాజెక్ట్ ప్రారంభం విషయంలోనే కొంత తగ్గుదల ఉందని.. అయితే రానున్న రోజుల్లో ఇది స్థిరపడుతుందని నివేదిక పేర్కొంది. దేశంలోని అన్ని ముఖ్యనగరాలతో పాటూ హైదరాబాద్‌లో నివాస, కార్యాలయాల రంగాల పరిస్థితులపై క్షేత్రస్థాయిలోని నివేదిక వివరాలను సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో సంస్థ డెరైక్టర్ (హైదరాబాద్, బెంగళూరు) అర్పిత్, మెహ్రోత్రా, హైదరాబాద్ డెరైక్టర్ వాసుదేవన్ అయ్యర్‌లు వివరించారు. ఈ సందర్భంగా వారేమన్నారంటే..

దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, అహ్మదాబాద్, ముంబై, పుణె, హైదరాబాద్‌లో 2016 తొలి ఆరు నెలల్లో నివాస, ఆఫీస్ మార్కెట్ పరిస్థితులను సమీక్షించారు. ఈ ఆరు ప్రధాన నగరాల్లో 2016 హెచ్1లో అమ్ముడుపోకుండా ఉన్న యూనిట్లు 6.60 లక్షలు కాగా.. గతేడాది ఈ సంఖ్య 7.10 లక్షలు. అంటే ఏడాదిలో 7 శాతం అమ్మకాల్లో వృద్ధి సాధించిందన్నమాట. అమ్మకాల్లో వృద్ధి, కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభంలో ఆలస్యాలే ఈ వృద్ధికి కారణం. ఇన్వెంటరీ భారం పూర్తిగా తొలగాలంటే మరో రెండేళ్ల సమయం పడుతుందని అంచనా.

నూతన గృహ ప్రాజెక్ట్‌ల విషయంలోనూ తగ్గుదలే కనిపిస్తుంది. గతేడాది హెచ్1లో 1,17,200 యూనిట్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది హెచ్1లో 1,07,120 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 9 శాతం మేర పడిపోయాయన్నమాట. ఇందులోనూ ఎన్‌సీఆర్‌లో 41 శాతం, చెన్నైలో 36 శాతం, పుణెలో 32 శాతం మేర ప్రారంభాలు పడిపోయాయి.

హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం కొత్త ప్రాజెక్ట్ అమ్మకాలు, ప్రారంభాలు పెరిగాయి. భాగ్యనగరంలో 2016 హెచ్1లో 5,700 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. 7,700 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి. 2016 హెచ్ 2 పూర్తయ్యే నాటికి సుమారు 8,200 యూనిట్లు అమ్ముడుపోతాయని అంచనా.

ఇప్పటికీ హైదరాబాద్ పశ్చిమ భాగం మార్కెట్ హవా కొనసాగుతుంది. ఇక్కడే ఎక్కువ ప్రారంభాలు, అమ్మకాలూ ఉంటున్నాయి,. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాలు కొత్తగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.

ఆఫీస్ స్పేస్ వృద్ధి..
తొలి ఆరు నెలల్లో ఆరు ప్రధాన నగరాల్లో గతేడాదితో 17.9 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ మార్కెట్ లావాదేవీలు జరిగితే.. ఈ ఏడాది హెచ్ 1లో 20 మిలియన్ చ.అ. జరిగాయి. అంటే 12 శాతం కార్యాలయాల మార్కెట్ వృద్ధి చెందిందన్నమాట. హైదరాబాద్ విషయానికొస్తే.. 2016 హెచ్ 1లో 2.8 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సరఫరా 140 శాతం, స్వీకరణ పరంగా చూస్తే 91 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రాజకీయ స్థిరత్వం, పారిశ్రామిక, ఐటీ పాలసీలు, ఐటీ/ఐటీఈఎస్ కంపెనీల రాక ఇందుకు కారణం.

ఆఫీస్ స్పేస్ వేకన్సీ 9.5 శాతంగా ఉంటే.. ప్రైమ్ ఆఫీస్ మార్కెట్లు అయిన మాదాపూర్, హైటెక్ సిటీల్లో 3.5-4 శాతంగా ఉంది. తగినంత సరఫరా లేని కారణంగా నగరంలో అద్దెలు 6 శాతం మేర పెరిగాయి.

పాత భవనాలను గ్రీన్ బిల్డింగ్స్ మార్చుకునే వీలుంది. గచ్చిబౌలిలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ భవనమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ త్రీస్టార్, ఫై స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం.

భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి.

సాధ్యమైనంత వరకు సౌర విద్యుత్‌నే వినియోగించాలి. భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గుతుంది.

ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది మరి.

వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు