అదరగొట్టిన కొటక్‌ మహీంద్ర బ్యాంకు

21 Jan, 2019 14:48 IST|Sakshi

సాక్షి, ముంబై:  మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశీయ ఐదవ అతిపెద్ద రుణదాత  కొటక్ మహీంద్రా  మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికరలాభంలో మెరుగైన ప్రదర్శనను కనబపర్చింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది.   డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో నికర లాభం రూ. 1,291 కోట్లును సాధించింది. అధిక వడ్డీ ఆదాయం తదితర కారణాలతో ఈ వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం కూడా 27శాతం వృద్ధి చెంది 2939కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది.   ఇది అంచనా వేసినదాని కంటే దాదాపు 26కోట్ల రూపాయలు అధికం. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 23 శాతం పుంజుకుని రూ. 2939 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.2 శాతం నుంచి 4.33 శాతానికి పెరిగింది.

ఈ త్రైమాసికంలో బ్యాడ్‌లోన్‌ కేటాయింపులు 50 శాతం పెరిగి 255 కోట్ల రూపాయలకు చేరాయి. మార్క్-టు-మార్కెట్ నష్టాలు రూ. 272 కోట్లు.డిసెంబర్ చివరలో మొత్తం రుణాల మొత్తం శాతం 2.07 శాతానికి నిలవగా, ఇంతకుముందు త్రైమాసికంలో 2.15 శాతం, అంతకుముందు ఏడాది 2.31 శాతంతో పోలిస్తే అస్సెట్ నాణ్యత మెరుగుపడింది.

మరిన్ని వార్తలు