కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత

7 May, 2020 15:06 IST|Sakshi

సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారితో సంక్షోభంలో పడిన వివిధ వ్యాపార సంస్థలు ఉద్యోగులపై వేటు వేయడంతోపాటు, హై స్థాయి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి.  తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు వేతనాల కోతను ప్రకటించింది. సంవత్సరానికి రూ. 25 లక్షలకు పైగా సంపాదించే ఉద్యోగులకు 10 శాతం వేతన కోత నిర్ణయించింది. సంవత్సరానికి రూ. 25 లక్షల కంటే ఎక్కువ వేతనం ఆర్జిస్తున్న ఉద్యోగులందరికీ  సీటీసీలో 10 శాతం తగ్గింపును నిర్ణయించామని, 2020,మే - 2021, మే నెల వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుందని  బ్యాంకు  ఒక నోటీసులో  తెలిపింది. వ్యాపార స్థిరత్వం కోసం  జీతాల రీకాలిబ్రేట్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. బ్యాంకుకు చెందిన టాప్ మేనేజ్ మెంట్ 2020-21 సంవత్సరానికి తమ జీతాల్లో 15 శాతం కోతను స్వచ్ఛందంగా  ప్రకటించిన కొన్ని వారాల తరువాత  తాజా నిర్ణయం  వెలుగులోకి వచ్చింది.  (కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత)

కరోనా వైరస్ విస్తృతి ప్రారంభంలో 2-3 నెలల విషయంగా కనిపించినా, క్రమేణా మహమ్మారిగా విజృంభించడంతో జీవితాలు, జీవనోపాధి రెండింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనీ, మరీ ముఖ్యంగా ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలేవీ లేవని స్పష్టంగా తెలుస్తుందని కోటక్ గ్రూప్ హెచ్ ఆర్ ముఖ్య అధికారి సుఖ్జిత్ ఎస్ పస్రిచా ఉద్యోగుల నోట్‌లో పేర్కొన్నారు. కాగా కోటక్ మహీంద్ర గ్రూపు పీఎం కేర్స్ పండ్ తో పాటు,  మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.  (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ కెమ్ స్పందన)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు