కొటక్‌ మహింద్రా 20 శాతం జంప్‌

25 Oct, 2017 14:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్‌ రంగ బ్యాంకు కొటక్‌ మహింద్రా సెప్టెంబర్‌ క్వార్టర్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభాల్లో 20 శాతం జంప్‌ చేశాయి. ఏడాది ఏడాదికి బ్యాంకు లాభాలు 19.81 శాతం పెరిగి రూ.1,440.68 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంకు లాభాలు రూ.1,202.40 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయాలు కూడా 15.80 శాతం పెరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.2,664.21 కోట్లగా ఉన్న బ్యాంకు నికర వడ్డీ ఆదాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.3,085.26 కోట్లగా ఉన్నాయి.  

ఈ క్వార్టర్‌లో ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడిందని కొటక్‌ మహింద్రా బ్యాంకు తన ఫలితాల్లో ప్రకటించింది. స్థూల నిరర్థక ఆస్తులు నుంచి స్థూల అడ్వాన్సుల  వరకు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 2.14 శాతం పెరిగాయి. నికర ఎన్‌పీఏ నుంచి నికర అడ్వాన్సుల వరకు 1.08 శాతమున్నాయి. స్టాండలోన్‌ ఆధారితంగా బ్యాంకు నికర లాభాలు 22.25 శాతం పెరిగి, రూ.994.31 కోట్లగా రి​కార్డయ్యాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బ్యాంకు షేర్లు 4.87 శాతం కిందకి ట్రేడవుతున్నాయి. 

మరిన్ని వార్తలు