కొటక్‌ నికర లాభం జంప్‌..అంచనాలు మిస్‌

20 Jul, 2017 13:01 IST|Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఏడాది తొలి క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 23 శాతం నికర లాభాలను ప్రకటించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది.  గురువారం  వెల్లడించిన  మొదటి  జూన్‌ త్రైమాసిక పలితాల్లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ. 912.73 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 742 కోట్లను  ఆర్జించింది. అయితే  రూ.975 గా ఎనలిస్టులు అంచనావేశారు.

నికర వడ్డీ  ఆదాయం(ఎన్‌ఐఐ)  17శాతం ఎగిసి రూ. 2246 కోట్లకు చేరింది.  స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.59 శాతం నుంచి 2.58 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.26 శాతం నుంచి 1.25 శాతానికి నామమాత్రంగా  బలహీనపడ్డాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కొటక్‌ నికర లాభం 26 శాతం పెరిగి రూ. 1347 కోట్లయ్యింది. ఎన్‌ఐఐ సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 3525 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) మాత్రం 4.6 శాతం నుంచి 4.4 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఈ త్రైమాసికానికి బ్యాంక్ సీఏఎస్‌ల 43.9 శాతం పెరిగింది. ఈ  క్వార్టర్‌  చివరికి  బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ రూ. 2,26,385 కోట్లుగా  ఉన్నాయి. ఈ ఫలితాలతో  కొటక్‌  మహీంద్ర బ్యాంక్‌ షేరు 1.7 శాతం  లాభాలతో ట్రేడ్‌ అవుతోంది.

 

మరిన్ని వార్తలు