ఫేస్‌ ఐడీతో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సేవలు

15 Jan, 2018 00:59 IST|Sakshi

ముంబై: ప్రైవేట్‌ రంగ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తాజాగా తన మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌కు కొత్త ఫీచర్లను జోడించింది. ఫింగర్‌ప్రింట్, ఫేస్‌ ఐడీలతో లాగిన్‌ కావొచ్చని తెలియజేసింది. అయితే ఫింగర్‌ ప్రింట్, ఫేస్‌ ఐడీ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.

 ‘బ్యాంక్‌ కస్టమర్లు వారి మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోకి మొబైల్‌ పిన్‌ (ఎం–పిన్‌) సాయం లేకుండానే బయోమెట్రిక్‌ అథంటికేషన్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. అలాగే ఎం–పిన్‌ అవసరం లేకుండా యాప్‌లోని చాలా సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. మరీముఖ్యంగా అన్ని రకాల నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లను నిర్వహించుకోవచ్చు. అయితే ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లకు మాత్రం ఎం–పిన్‌ తప్పనిసరి’ అని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వివరించింది. 

మరిన్ని వార్తలు