లంబోర్గిని హరకేన్ స్పైడర్@ రూ. 3.89 కోట్లు

6 May, 2016 01:37 IST|Sakshi
లంబోర్గిని హరకేన్ స్పైడర్@ రూ. 3.89 కోట్లు

గరిష్ట వేగం గంటకు 324 కి.మీ.
కారు ప్రత్యేకతలు...: ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 3.4 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 324 కి.మీ. అని కంపెనీ పేర్కొంది.  రిట్రాక్టబుల్ రూఫ్, డబ్ల్యూ షేప్‌లో ఉండే ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, 7 స్పీడ్ ఎల్‌డీఎఫ్ డ్యుయల్‌క్లచ్ ట్రాన్స్‌మిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపింది.

 ముంబై: ఇటలీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ లంబోర్గిని కొత్త హరకేన్  ఎల్‌పీ 610-4 స్పైడర్ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.3.89 కోట్లు(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) అని కంపెనీ పేర్కొంది. తమ  ఓపెన్ టాప్ మోడల్ విభాగంలో గెల్లార్డో స్పైడర్ మంచి అమ్మకాలు సాధించిందని, ఈ కారు స్థానాన్ని కొత్తగా తెస్తున్న ఈ హరకేన్ స్పైడర్ భర్తీ చేస్తుందని లంబొర్గిని ఆగ్నేయాసియా హెడ్ సెబాస్టియన్ హెన్రి చెప్పారు. తమకు  వ్యూహాత్మకమైన కీలక మార్కెట్లలో ఒకటని పేర్కొన్నారు. పెర్ఫామెన్స్ డ్రైవింగ్, సౌకర్యం, టెక్నాలజీ కోరుకునే వినియోగదారుల లక్ష్యంగా ఈ కొత్త స్పోర్ట్స్ కారును అందుబాటులోకి తెస్తున్నామని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు