నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

14 Jun, 2019 16:46 IST|Sakshi

ముంబై : పుల్‌బ్యాక్‌ ర్యాలీ కొనసాగినా సెషన్‌ చివరిలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో పలు షేర్లలో కొనుగోళ్ల జోరు సాగినా చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 289 పాయిం‍ట్ల నష్టంతో 40వేల పాయింట్ల దిగువన 39,452 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 91 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలక 12,000 పాయింట్ల దిగువన 11,823 పాయింట్ల వద్ద క్లోజయింది. రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

మరిన్ని వార్తలు