2 సెకన్లలో 70 వేల స్మార్ట్ ఫోన్ల సేల్

3 Feb, 2016 12:26 IST|Sakshi
2 సెకన్లలో 70 వేల స్మార్ట్ ఫోన్ల సేల్

న్యూఢిల్లీ: ఆన్ లైన్ ఫ్లాష్ అమ్మకాల్లో లీఈకో సరికొత్త రికార్డు సృష్టించింది.  2 సెకన్లలో 70 వేల స్మార్ట్ ఫోన్లు అమ్మి సత్తా చాటింది. లీఈకో ప్రవేశపెట్టిన లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 2న ఫ్లిప్ కార్ట్ లో ఫ్లాష్ అమ్మకానికి పెట్టింది. 2 సెకన్లలోనే 70 వేల ఫోన్లు అమ్ముడయినట్టు లీఈకో తెలిపింది. భారతీయ మార్కెట్ లో ఈ స్థాయిలో స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది.

అమేజింగ్ ఫీచర్లతో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను తయారీ ధర కంటే తక్కువకే అందిస్తున్నామని పేర్కొంది. ఈ ఫోన్ కోసం 11 రోజుల్లో 605,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించింది. చైనాలో ఎల్ఈటీవీ(LeTV)గా ఈ సంస్థ చెలామణి అవుతోంది.

లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు
3 జీబి ర్యామ్
32 జీబి ఇంటర్నల్ మెమరీ
5.5 ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే
డ్యుయల్ సిమ్
మిర్రర్ సర్ ఫేస్ ఫింగర్ స్కానర్
హెలియో ఎక్స్ 10 ప్రాసెసర్
ధర రూ.10,999.

మరిన్ని వార్తలు