ఇండస్ట్రీ రికార్డులో ఆ ఫోన్ల అమ్మకాలు

29 Jun, 2016 12:13 IST|Sakshi
ఇండస్ట్రీ రికార్డులో ఆ ఫోన్ల అమ్మకాలు

 న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ లీఎకో తన స్మార్ట్  ఫోన్ల  అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఇండస్ట్రీ రికార్డు  సేల్స్ ను నమోదు చేసింది. ఒకే రోజులో రూ.78.6 కోట్ల విలువైన 61,000 మొబైళ్లను ఆన్‌లైన్లో విక్రయించింది. ఇది ‘పరిశ్రమ రికార్డు’గా కంపెనీ వెల్లడించింది. తాజా విక్రయాలతో గడిచిన 5 నెలల్లోనే 7 లక్షల మొబైళ్ల విక్రయాలను అధిగమించినట్లు లీఎకో ఇండియా స్మార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఓఓ అతుల్‌ జైన్‌ పీటీఐకి తెలిపారు.  

 ప్రీమియం క్వాల్కమ్ స్నాప్ డ్రా గెన్ చిప్ సెట్ కలిగిన రెండు స్మార్ట ఫోన్ల అమ్మకాలు ప్రారంభించిన మొదటి సంస్థ  తమదేనన్నారు.  మంగళవారం కంపెనీ తన లీ 2, లీ మాక్స్‌2 మోడల్  మొబైళ్లను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచగా.. మొత్తం 61000  స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్టు  లీ ఇకో తెలిపింది.   ఇందులో 80 శాతం లీ 2  కావడం విశేషం.  లీ 2, లీ మాక్స్‌2 కొనుగోలుదార్లకు రూ.1990 విలువైన సీడీఎల్‌ఏ ఇయర్‌ ఫోన్లను ఉచితంగా ఇచ్చినట్లు జైన్‌ చెప్పారు. రెండు ఫోన్లకూ ఒక ఏడాది లీఎకో సభ్యత్వం(రూ.4900 విలువ చేసే) ఉంటుంది.  తద్వారా 2000 బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలను చూడొచ్చు. అలాగే 150కి పైగా లైవ్‌ ఛానెళ్లను కూడా  యాక్సెస్ చేసుకునే  అవకాశాన్ని లీ ఇకో  అందిస్తోంది.


కాగా,   లీ 2, లీ మాక్స్‌2రెండు మోడళ్లు క్వాల్‌కాం చిప్‌ సెట్‌లతో   రూపొందించినవే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సంస్థ 4జీ స్మార్ట్‌ ఫోన్లను తన ఆన్ లైన్ లీ మాల్  ద్వారా విక్రయించడం మొదలు  పెట్టిన సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు