లీఎకో నుంచి ‘సూపర్3’ సిరీస్ స్మార్ట్ టీవీలు

5 Aug, 2016 01:18 IST|Sakshi
లీఎకో నుంచి ‘సూపర్3’ సిరీస్ స్మార్ట్ టీవీలు

ధర రూ.59,790-రూ.1,49,790

న్యూఢిల్లీ: చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘లీఎకో’ తాజాగా తన ‘సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ‘ఎక్స్55’, 65 అంగుళాల ‘ఎక్స్65’, 65 అంగుళాల ‘మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్‌డీ (3840ఁ2160) రెజల్యూషన్ వీటి సొంతం. ‘ఎక్స్55’ ధర రూ.59,790గా, ‘ఎక్స్65’ ధర రూ. 99,790గా, ‘మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది.

ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయని, ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ‘ఎక్స్55’లో 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీని, మిగతా ప్రొడక్టులలో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఫీచర్లను పొందుపరిచామని పేర్కొంది. ఈ ఆండ్రాయిడ్ టీవీలన్నీ వినియోగదారులకు కంపెనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లీమాల్ సహా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మరిన్ని వార్తలు