జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీలో అమ్మకానికి వాటా

31 Jan, 2017 01:05 IST|Sakshi
జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీలో అమ్మకానికి వాటా

న్యూఢిల్లీ: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు చెందిన జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీలో ఉన్న 55 శాతం వాటాను విక్రయించేందుకు ఐడీబీఐ బ్యాంకు నేతృత్వంలోని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న 768 మెగావాట్ల సహజ వాయువు ఆధారిత విద్యుత్‌ ప్లాంటుకై ఇచ్చిన అప్పులో కొంత మొత్తాన్ని రుణమిచ్చిన కంపెనీలు...ఆ రుణంలో కొంత భాగాన్ని గతేడాది ఈక్విటీగా మార్చుకున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై రూ.2,366 కోట్ల అప్పు ఉంది. రుణ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ వాటాను విక్రయిస్తున్నాయి. స్తోమత కలిగిన కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొని 55 శాతం వాటాను దక్కించుకోవచ్చని, మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌ చేపట్టవచ్చని ప్రీ–బిడ్‌ డాక్యుమెంట్‌లో ఐడీబీఐ క్యాపిటల్‌ తెలిపింది. విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం 2012లో పూర్తి అయినప్పటికీ గ్యాస్‌ కొరత కారణంగా 2015 అక్టోబరులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది.

>
మరిన్ని వార్తలు