లెనోవో పండగ ఆఫర్లు

30 Sep, 2016 20:04 IST|Sakshi
లెనోవో పండగ ఆఫర్లు

న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన జడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ఇండియా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ లో భాగంగా ఈ ఆఫర్లు ఇవ్వనుంది. పాత ఫోన్లను మార్చుకుని గరిష్టంగా రూ. 12 వేల వరకు రాయితీ పొందవచ్చని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. అదనంగా రూ. 2 వేల వరకు క్యాష్ బాక్ అందుకోచ్చని వెల్లడించింది.

ఎనిమిది బ్యాంకులు, బజాజ్ ఫైనాన్స్ ఎటువంటి చార్జీలు లేకుండానే ఈఎంఐ మీద ఫోన్లు విక్రయిస్తామని లెనోవో ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ అనుజ్ శర్మ చెప్పారు. డ్యుయల్ సిమ్ ను సపోర్ట్ చేసే జడ్ 2 ప్లస్ ఫోన్ 3 జీబీ(రూ.17,999), 4జీబీ(రూ.19,999) వెరియంట్ లో లభిస్తుంది.

జడ్ 2 ప్లస్ ఫీచర్లు
5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
820 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్
3 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4కే వీడియో రికార్డింగ్
3500 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు